అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లును వెంటనే అమలు చేయాలి
అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లును వెంటనే ఆమోదించి అమలు చేయాలని వైయస్ఆర్సీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ కోఆర్డినేటర్ వడ్డి రఘురాం డిమాండ్ చేశారు. న్యాయవాదులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో లా నేస్తం పథకం ద్వారా జూనియర్ న్యాయవాదులకు ఆర్థిక సహాయం అందించామని, రూ.100 కోట్ల అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్ కార్పస్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు.