Friday, 9 October 2026 Daily ePaper
Telugu Daily ePaper

వైయస్ఆర్సీపీలో నూతన నియామకాలు

వైయస్ఆర్సీపీలో నూతన నియామకాలు

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి పలు నియామకాలను చేపట్టారు. కర్నూలు, నంద్యాల జిల్లాల కోఆర్డినేటరుగా భూమన కరుణాకరరెడ్డి, చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఎన్.వెంకటగౌడ, తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా భూమన అభినయరెడ్డి నియమితులయ్యారు. పార్టీ సీఈసీ సభ్యునిగా రంగాలి జగన్నాథం, ఎస్ఈసీ సభ్యులుగా పరిస వెంకటనారాయణ, నాగేశ్వరరావు, సమంతలపూడి బాలసూర్యనారాయణ రాజు, ఓ.ఎం.పి మధుసూదన్ రావు నియమితులయ్యారు.