వైయస్ఆర్సీపీ బలపర్చిన అభ్యర్థుల విజయమే లక్ష్యం
అనపర్తి రామవరం గ్రామంలో నిర్వహించిన వైయస్ఆర్సీపీ గ్రామ కమిటీ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ బలపర్చిన అభ్యర్థుల విజయానికి పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పదవీకాలం పూర్తి చేసిన పంచాయతీ పాలకమండలి సభ్యులను సత్కరించి, పార్టీ కమిటీల్లో పనిచేస్తున్న నాయకులకు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు.