ప్రొద్దుటూరులో టీడీపీకి షాక్
వైయస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు టౌన్ మోదంపల్లె హరిజనవాడకు చెందిన రాజేశ్‌తో పాటు 80 కుటుంబాలు తెలుగుదేశం పార్టీని వీడి వైయస్ఆర్సీపీలో చేరాయి. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని శివప్రసాద్ రెడ్డి సూచించారు.