Friday, 9 October 2026 Daily ePaper
Telugu Daily ePaper

పేదల సంక్షేమానికి తూట్లు

పేదల సంక్షేమానికి తూట్లు

కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమానికి తూట్లు పొడుస్తుందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 'గడప గడపకు వైయస్ఆర్సీపీ' కార్యక్రమంలో భాగంగా ప్రజలను కలిసిన ఆయన, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల పొందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. జగనన్న కాలనీల పట్టాలను రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. నంద్యాల మెడికల్ కాలేజీ ఘటనపై ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.