డీఎస్సీ తరహాలోనే స్విమ్స్ నియామకాల్లో అవినీతి
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్విమ్స్‌లో 116 పోస్టుల భర్తీలో భారీగా అక్రమాలు, అవినీతి జరిగాయని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. నారా ఆదిశేషయ్య, లోకేష్ సూచనల మేరకు డాక్టర్ పోస్టుల నుంచి కింది స్థాయి ఉద్యోగాల వరకు నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ అవినీతిపై విచారణ చేయిస్తామని భూమన కరుణాకరరెడ్డి తెలిపారు.